వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి
అంబరానికే నీదే ప్రేమ జాబిలి
ఊహలకే ఊపిరొచ్చెనే
ఊసులకే ఊహ తెలిసెనే
ఊరించే ఆశలెన్నో మదిలో
మనసంతా పరవశించెలే
నీకోసం పరితపించెలే
నీ రూపం నిండి ఉంది యదలో
నీ మాటల్లో ఏవో సరిగమలు
ఓ.. నీ మౌనంలో ఏవో గుసగుసలు
నీ కన్నుల్లో రంగుల రాగాలు
ఓ.. ఆ రాగంలో ఏవో విరహాలు
ఓ చెలియా చెంత చేరనా
మత్తెక్కే మాయ చేయనా
నీ పెదవిని పలకరించి పోనా
మురిపించే మాట చెప్పనా
కరిగించే కౌగిలివ్వనా
ముద్దులనే మూటకట్టి తేనా
వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి
అంబరానికే నీదే ప్రేమ జాబిలి
నీ సిరిమువ్వల సవ్వడి నను తాకే
ఓ.. నీ చిరునవ్వుల వల నను బంధించే
నా హృదయంలో అలజడివయినావే
ఓ.. నా శ్వాసకు నువు శృతివై నిలిచావే
ప్రియురాలా ప్రేమ పంచుకో
పరువాలా పల్లవందుకో
గుండెల్లో నన్ను దాచుకోవే
పదరా అధరాల విందుకు
వయసారా పిలిచినందుకు
తనువారా నన్ను దోచినావే
వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి
అంబరానికే నీదే ప్రేమ జాబిలి
మనసంతా పరవశించెలే
నీకోసం పరితపించెలే
నీ రూపం నిండి ఉంది యదలో
ఊహలకే ఊపిరొచ్చెనే
ఊసులకే ఊహ తెలిసెనే
ఊరించే ఆశలెన్నో మదిలో
వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి
అంబరానికే నీదే ప్రేమ జాబిలి
చిత్రం : వంశీ (2000)
సంగీతం : మణిశర్మ
రచన :
గానం :